చిరాకు దెయ్యం
నాకు కళలంటే చిరాకు!
నీకు దెయ్యలంటే చిరాకు!!
నాకు వర్షం చిరాకు!
నీకు చలి చిరాకు!!
నాకు సినిమా అంటే చిరాకు!
నీకు చదువు అంటే చిరాకు!!
నాకు మొహమాటం చిరాకు!
నీకు పలకరింపు చిరాకు!!
నాకు ఆవాలు చిరాకు!
నీకు నువ్వులు చిరాకు!!
నాకు రైలు ప్రయాణమంటే చిరాకు!
నీకు బస్సు ప్రయాణమంటే చిరాకు!!
నాకు చెంచాతో తినడమంటే చిరాకు!
నీకు చేతితో తినడమంటే చిరాకు!!
నాకు నూనె చిరాకు!
నీకు నెయ్యి చిరాకు!!
నాకు బద్దకం అంటే చిరాకు!
నీకు చెమట వెయ్యడం చిరాకు!!
నాకు గోర్లు పెంచడమంటే చిరాకు!
నీకు గోర్లు కొరకడమంటే చిరాకు!!
నాకు పని చెప్పడమంటే చిరాకు!
నీకు పని చెయ్యడమంటే చిరాకు!!
నాకు చపాతీలు చిరాకు!
నీకు దోశలు చిరాకు!!
నాకు సిమెంట్ ఇళ్ళంటే చిరాకు!
నీకు మండువా ఇళ్లంటే చిరాకు!!
నాకు నీ బంధువులు చిరాకు!
నీకు నా బంధువులు చిరాకు!!
నాకు విలాసాలు చిరాకు!
నీకు సర్దుకుపోవడం చిరాకు!!
నాకు కూర్చోడం చిరాకు!
నీకు పరిగెత్తడం చిరాకు!!
నాకు ఆశంటే చిరాకు!
నీకు అవకాశమంటే చిరాకు!!
నాకు ఖర్చులు చిరాకు!
నీకు పొదుపు చిరాకు!!
నాకు మాట్లాడటం చిరాకు!
నీకు రాయటం చిరాకు!!
నాకు అజాగ్రత్త చిరాకు!
నీకు పరిశుభ్రత చిరాకు!!
నాకు తొరకలు చిరాకు!
నీకు మీగడ చిరాకు!!
నాకు మెలుకువగా ఉండటం చిరాకు!
నీకు ఉదయం లేవడం చిరాకు!!
నాకు కాలు మీద కాలు వేస్కోడం చిరాకు!
నీకు కుర్చీలో మఠం వేస్కోడం చిరాకు!!
నాకు ఇంగ్లీష్ చిరాకు!
నీకు తెలుగు చిరాకు!!
నాకు మాగాయి చిరాకు!
నీకు అవకాయ చిరాకు!!
నాకు కారంటే చిరాకు!
నీకు బైకంటే చిరాకు!!
నాకు వెస్టర్న్ చిరాకు!
నీకు మెలోడీ చిరాకు!!
నాకు కాఫీ చిరాకు!
నీకు బూస్ట్ చిరాకు!!
నాకు ఫోన్ చిరాకు!
నీకు లాప్టాప్ చిరాకు!!
నాకు కంగారు చిరాకు!
నీకు సావకాశం చిరాకు!!
మన మొదటి కలయికలో పేర్కొన్న చిరాకులు మన పెళ్ళికి ఓనమాలు, జీవితాలకు ప్రేమ కాగడాలు!!!
Comments
Post a Comment